షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్‌ప్రైజ్‌ గిప్ట్! వీడియో వైరల్‌ | Video: New Dad Jasprit Bumrah Gets Surprise Gift From Shaheen Afridi | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్‌ప్రైజ్‌ గిప్ట్! వీడియో వైరల్‌

Published Mon, Sep 11 2023 8:46 AM | Last Updated on Mon, Sep 11 2023 9:10 AM

New Dad Jasprit Bumrah Gets Surprise Gift From Shaheen Afridi - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో బిగ్గెస్ట్‌ ఫైట్‌ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌. దయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పకున్న తక్కువే. చిరకాల ప్రత్యర్థిల క్రికెట్‌ యుద్దం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతృతగా ఎదురుచూస్తుంటారు.  భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఇరు జట్ల ఆటగాళ్లపై కూడా తీవ్ర ఒత్తడి ఉంటుంది.

అయితే ఏదైమైనప్పటికి ఆటగాళ్ల మధ్య వైరం మైదానం వరకే. ఆఫ్‌ది ఫీల్డ్‌ ఇరు జట్ల ఆటగాళ్లు మంచి స్నేహితులగా ఉంటారు. ఇప్పటికే పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి అంటే తనకు ఎంతో ఇష్టమని సృష్టం చేశాడు. కోహ్లి కూడా పాక్‌ ఆటగాళ్లతో ఆప్యాయంగా మాట్లాడిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి భారత్‌-పాకిస్తాన్‌ ఆటగాళ్ల మధ్య మంచి స్నేహ బంధం ఉందని రుజువైంది.

షాహీన్ అఫ్రిది మంచి మనసు..
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది తన మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సూపర్‌ 4 మ్యాచ్‌ సందర్భంగా బుమ్రాను కలిసిన అఫ్రిది శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాకుండా ఓ గిఫ్ట్ సైతం ఇచ్చాడు. అనంతరం వీరిద్దరూ అలింగనం చేసుకున్నారు.

'మీకు చాలా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా చూడాలి. నయా బుమ్రాను తయారు చెయ్. గుడ్‌లక్‌" అంటూ అఫ్రిది అన్నాడు. అందుకు బదులుగా బుమ్రా నవ్వుతూ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా బుమ్రా భార్య సంజన గణేషన్ సెప్టెంబర్ 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే(సోమవారం)కు వాయిదా పడింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 24.1 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది.
చదవండిODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. కేన్‌ మామ వచ్చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement