'Absolutely Love Him, Wanna Marry Him': Ramiz Raja Makes Bizarre Comment On Babar Azam - Sakshi
Sakshi News home page

Babar Azam: బాబర్‌ ఆజం అంటే ప్రేమ.. అతడిని పెళ్లి చేసుకోవాలని కోరిక: రమీజ్‌ రాజా కామెంట్లు వైరల్‌

Aug 8 2023 3:10 PM | Updated on Aug 8 2023 3:33 PM

Absolutely Love Him Wanna Marry Him: Ramiz Raja Bizarre Comment On Babar Azam - Sakshi

Ramiz Raja bizarre comment on Babar Azam: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా బాబర్‌ ఆజంను ఉద్దేశించి వింత వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌ బ్యాటింగ్‌ మెరుపుల నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ కాస్త అతిగా స్పందించాడు. కాగా లంక ప్రీమియర్‌ లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.

యూనివర్సల్‌ బాస్‌ తర్వాత
గాలే టైటాన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా సుడిగాలి శతకం బాది రికార్డులకెక్కాడు. 59 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. లక్ష్య ఛేదనలో భాగంగా 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి.. టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా 10 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. యూనివర్సల్‌ బాస్‌, వెస్టిండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

అతడంటే ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని ఉంది
ఈ క్రమంలో బాబర్‌ ఆజం తుపాన్‌ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ.. ‘‘అద్బుతం.. క్లాస్‌.. క్వాలిటీ ఫిఫ్టీ. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతడంటే నాకు పిచ్చి ప్రేమ. అతడి పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో ఉండిపోయింది’’ అంటూ కామెంటేటర్‌ రమీజ్‌ రాజా వ్యాఖ్యానించాడు. 

ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు
బాబర్‌ను ఉద్దేశించి ఈ మాజీ బ్యాటర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ‘గే’ అంటూ విపరీతపు కామెంట్లతో రమీజ్‌ రాజాను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్‌ అభిమానులు మాత్రం.. తన శిష్యుడిపై ప్రేమతో ఇలా స్పందించాడే తప్ప.. ఇందులోనూ విపరీతార్థాలు వెదకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

సంతోషంగా ఉంది
ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడటం సంతోషంగా ఉందన్న బాబర్‌ ఆజం.. లీగ్‌ మ్యాచ్‌లతో పాటు రానున్న ప్రతి సిరీస్‌ రానున్న ఐసీసీ ఈవెంట్లకు తమకు సన్నాహకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం తన దృష్టి మొత్తం లంక ప్రీమియర్‌ లీగ్‌ మీదే ఉందని చెప్పుకొచ్చాడు.

చదవండి: టీమిండియా క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement