
కరాచీ: యూఏఈ వేదికగా జరుగనున్న ఈ సీజన్ ఐపీఎల్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర అని పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్, కామెంటేటర్ రమీజ్ రాజా జోస్యం చెప్పాడు. యూఏఈలో బ్యాటింగ్ కంటే స్పిన్‌కే ఎక్కువ అనుకూలమన్నాడు. దాంతో హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్లకు కష్టాలు తప్పవన్నాడు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ ఘనవిజయాల్లో ఇప్పటివరకూ ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నప్పటికీ ఈసారి మాత్రం స్పిన్ ఉచ్చులో చిక్కుకుంటారన్నాడు. ‘ ఈ సీజన్‌లో ఎవరితై స్పిన్ విభాగంలో బలంగా ఉంటారో ఆయా జట్లకే విజయావకాశాలు ఎక్కువ. (చదవండి: పొలార్డ్ గ్యాంగ్‌పై షారుక్ ప్రశంసలు)
ఇక్కడ బిగ్ హిట్టర్లకు కష్టలు తప్పవు. పాండ్యా స్పిన్ బాగా ఆడతాడు. పొలార్డ్ కూడా స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే ఆటగాడే.. కానీ వీరు స్పిన్ బౌలింగ్‌కు తేలిపోతారు. ఈ ఐపీఎల్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇక్కడ మనం భిన్నమైన ఆటను చూడటం ఖాయం’ అని రమీజ్ రాజా క్రిక్ కాస్ట్ నిర్వహించిన యూట్యూబ్ షోలో తెలిపాడు. ఇక ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో లేకుండా ఆడటం పెద్ద జట్లకు సవాల్‌గా మారనుందన్నాడు. కేకేఆర్, ఆర్సీబీలో తన హోమ్ గ్రౌండ్‌లో అశేషమైన ప్రేక్షక్షుల మద్దతుతో గత సీజన్‌లో ఆడినా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆడాల్సి ఉందన్నాడు. ఇదొక భిన్నమై టాస్క్ అని, తటస్థమైన వేదికల్లో ఎలా ఆడతారనేది ఆసక్తికరమన్నాడు. ఈనెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది.(చదవండి: ‘ఆ గన్ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’)