అగస్త్యను చాలా మిస్సవుతున్నా : హార్దిక్‌ | Hardik Pandya Shares Throwback Video Playing With His Son | Sakshi

అగస్త్యను చాలా మిస్సవుతున్నా : హార్దిక్‌

Nov 6 2020 9:10 PM | Updated on Nov 6 2020 9:10 PM

Hardik Pandya Shares Throwback Video Playing With His Son - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 14 బంతుల్లోనే 37 పరుగులు చేసిన పాండ్యా ముంబై భారీ స్కోరు చేయడానికి బాటలు పరిచాడు. అంతేగాక భారీ స్కోరు చేసిన ముంబై  ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగి ఢిల్లీని చిత్తుచేసి ఆరవసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్‌ చేరిన ఆనందంలో ఉన్న హార్దిక్‌ పాండ్యా తన కొడుకు అగస్త్యతో ఆడుకుంటున్న త్రోబ్యాక్‌ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. (చదవండి : 'నీ లుక్‌ అదుర్స్‌.. పాట డబుల్‌ అదుర్స్'‌)

'అగస్త్య.. ఐపీఎల్‌ కారణంగా నిన్ను చాలా మిస్సవుతున్నా. నీతో ఆడుకున్న రోజులు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి. నేను నీ దగ్గరికి వచ్చేవరకు నీతో ఆడుకున్న మొమోరీలను నాతో పాటే ఉంచుకుంటా.. మిస్‌ యూ రా అగస్త్య' అంటూ ఎమోషనల్‌ ఫీలింగ్‌తో క్యాప్షన్‌ జత చేశాడు.  కాగా ఈ ఏడాది జనవరిలో తన ప్రియురాలైన నటాషా స్టాంకోవిక్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. గత జూలైలో నటాషా పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో హార్దిక్‌ తండ్రి అయిన సంగతి  తెలిసిందే. 

ఇప్పటికే ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌ ఐదోసారి టైటిల్‌ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతుంది. కాగా శుక్రవారం ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య జరగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగే క్వాలిఫయర్‌-2 ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్‌-2 లో గెలిచిన జట్టు నవంబర్‌ 10, మంగళవారం జరగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'టీమిండియాపై స్లెడ్జింగ్‌ ఈసారి కష్టమే')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement