
కరాచీ: తమ జూనియర్ స్థాయి జట్లకు భారత మాజీ ఆటగాడు రాహుల్ ద‍్రవిడ్ తరహా కోచ్‌ల పర్యవేక్షణ చాలా ఉందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అండర్-19 క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రమీజ్ సూచించాడు. ఈ విధానాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సైతం అనుసరిస్తే జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లు వస్తారన్నాడు.
'రాహుల్ పర్యవేక్షణలో భారత జూనియర్ క్రికెట్ జట్లు రాటుదేలుతున్నాయి. ఇక్కడ బీసీసీఐని పీసీబీ ఫాలో కావాలి. మంచి అనుభవం కల్గిన ఒక మాజీ టెస్టు ప్లేయర్‌ను పాకిస్తాన్ అండర్-19 కోచ్‌గా నియమించండి. జాతీయ జూనియర్ జట్ల విషయంలో గెలుపు అనేది ముఖ్యం కాదు. అక్కడ వారి వ్యక్తిగత ప్రదర్శనల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా భారత క్రికెట్ జట్టు చాలా లబ్ది పొందిందనే విషయం పీసీబీ గ్రహించాలి. యువ క్రికెటర్లలో ఉన్న టాలెంట్‌ను ద్రవిడ్ బయటకు తీస్తున్నాడు. దాంతో టీమిండియా పటిష్టంగా తయారైంది. మన క్రికెట్ బోర్డు కూడా ద్రవిడ్‌లాంటి కోచ్‌ను అండర్-19 జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది' అన్ని రమీజ్ రాజీ విజ్ఞప్తి చేశాడు.