శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
New Zealand vs India, 1st ODI- Shreyas Iyer: టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత ఎనిమిది మ్యాచ్‌లలో అతడి నిలకడైన ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు అయ్యర్. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో
కివీస్ గడ్డ మీద వన్డేల్లో వరుసగా నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఈ జాబితాలో అయ్యర్ కంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. గత ఎనిమిది వన్డేల్లో భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ 5 అర్ధ శతకాలు, ఒక శతకం సాధించడం విశేషం.
కివీస్ గడ్డపై శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత: న్యూజిలాండ్‌లో వన్డేల్లో అయ్యర్ నమోదు చేసిన స్కోర్లు 103(107), 52(57), 62(63), 51*(57).
ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం!
ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 54, 63, 44, 50, 113 నాటౌట్, 28 నాటౌట్, 80. ఈ నేపథ్యంలో రానున్న వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కడం ఖాయమంటూ అతడి అభిమానులు సంబరపడిపోతున్నారు.
Shreyas Iyer in last 8 innings in ODI format:
— Johns. (@CricCrazyJohns) November 25, 2022
80(111)
54(57)
63(71)
44(34)
50(37)
113*(111)
28*(23)
80(76)
This is ridiculous consistency. pic.twitter.com/MjTn6XP99I
ఇదే తరహాలో నిలకడగా ఆడుతూ ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని ఈ ముంబై బ్యాటర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ‘‘ ఏయ్ బిడ్డా.. ఓడీఐ నా అడ్డా’’ అంటూ అయ్యర్ ఆటను కీర్తిస్తూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ గురూ.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కివీస్‌తో ఆక్లాండ్‌లోని మొదటి వన్డేలో శ్రేయస్ అయ్యర్ 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు.
చదవండి: IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment