వన్డే ప్రపంచకప్-2203లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో ఆసియా జట్టుతో తలపడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 23న చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో పాక్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని బాబర్ సేన భావిస్తోంది.
మరోవైపు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కే షాకిచ్చిన ఆఫ్గాన్.. పాకిస్తాన్‌ను కూడా మట్టి కరిపించాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కంటే ఆఫ్గానిస్తాన్ కాస్త ఫేవరెట్‌గా కన్పిస్తోంది అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు.
"పాకిస్తాన్ తిరిగి కోలుకోవడం చాలా కష్టం. చెన్నైలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎదైనా జరగవచ్చు. ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్లను మా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. ఒక వేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాకిస్తాన్‌పై ఆఫ్గాన్ కచ్చితంగా పై చేయి సాధిస్తుంది. అదే వికెట్‌పై ఇంగ్లండ్‌పై ఆఫ్గాన్ ఏమి చేసిందే మనం చూశామని" తన యూట్యూబ్ ఛానల్‌లో రమీజ్ రజా పేర్కొన్నాడు.
కాగా అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తానే విజయం సాధించింది. అయితే చాలాసార్లు మాత్రం పాకిస్తాన్‌కు ఆఫ్గాన్ గట్టిపోటీ ఇచ్చింది.
చదవండి: IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment