ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇషాన్ కిషన్(PC: IPL)
IPL- PSL: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచంలోని ఏ ఇతర లీగ్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పోటీ ఇవ్వలేని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో డ్రాఫ్ట్ మోడల్ కాకుండా వేలం నిర్వహించాలన్న రమీజ్ రాజా.. అలా అయితే ఐపీఎల్ సత్తా ఏమిటో తెలుస్తుందని ప్రగల్బాలు పలికాడు.
ఈ మేరకు అతడు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా మనం(పాకిస్తాన్ క్రికెట్) మరింత స్వతంత్రంగా మారాలంటే కొత్త ఆస్తులు కూడగట్టుకోవాలి. ప్రస్తుతం మనకు పీఎస్‌ఎల్, ఐసీసీ నిధులు తప్ప మరే ఇతర ఆదాయ మార్గాలు లేవు. వచ్చే ఏడాది నుంచి మనం ఆక్షన్ మోడల్(వేలం)అనుసరించాలి. మన ఎకానమీ పెరిగితే గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఐపీఎల్ ఎవరు ఆడతారో చూద్దాం’’ అని వ్యాఖ్యానించాడు.
ఇందుకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. ‘‘ఒకవేళ మీరు డ్రాఫ్ట్ సిస్టమ్ కాదని వేలానికి వెళ్లినా మీరు చెప్పింది జరుగదు. పీఎస్‌ఎల్‌లో 16 కోట్లకు అమ్ముడు పోయే ఆటగాడిని మనం చూడలేము.
మీరు అన్న మార్కెట్ శక్తులే దీనిని ఆమోదించవు. పీఎస్‌ఎల్, బీబీఎల్, ది హండ్రెడ్, సీపీఎల్ ఏదీ కూడా ఐపీఎల్‌కు పోటీ ఇవ్వలేదు. ఈ పోలికలు అనవసరం’’ అని కౌంటర్ వేశాడు. కాగా పీఎస్‌ఎల్‌లో డ్రాఫ్ట్ సిస్టమ్‌లో భాగంగా ఒక్కో ఫ్రాంఛైజీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటుంది. వీటిలో ప్లాటినమ్, డైమండ్, గోల్డ్, సిల్వర్, ఎమర్జింగ్, సప్లిమెంటరీ అనే కేటగిరీలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యధిర ధరకు కొనుగోలు చేసింది.
చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్
Comments
Please login to add a commentAdd a comment