Grant Bradburn Named Interim Head Coach Of Pakistan - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో అయోమయం

Apr 8 2023 1:36 PM | Updated on Apr 8 2023 2:41 PM

Grant Bradburn Named Interim Head Coach Of Pakistan - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)లో అయోమయకర పరిస్థితి నెలకొంది. పీసీబీ ఒక్కో సిరీస్‌కు ఒక్కో కోచ్‌కు మారుస్తూ గందరగోళం సృష్టిస్తుంది. ఆ జట్టు ఆడిన గత సిరీస్‌ (షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌) కోసమని అబ్దుల్‌ రెహ్మాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన పీసీబీ.. ఆ సిరీస్‌లో పాక్‌కు చేదు అనుభవం (1-2తో పాక్‌ సిరీస్‌ కోల్పోయింది) ఎదురుకావడంతో రోజుల వ్యవధిలో మరో కోచ్‌ను మార్చింది.  

స్వదేశంలో త్వరలో ప్రారంభంకానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసమని పాక్‌ క్రికెట్‌ బోర్డు న్యూజిలాండ్‌కే చెందిన గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే.. పాక్‌ ఏ జట్టుతో అయితే సిరీస్‌ అడుతుందో, ఆదే దేశానికి చెందిన కోచ్‌ల సేవలను వినియోగించుకుంటుంది.

గతంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ఆడినప్పుడు ఆ దేశ మాజీ కోచ్‌ల సేవలను వినియోగించుకుంది. మిక్కీ ఆర్థర్‌ వైదొలిగాక చాలాకాలంగా రెగ్యులర్‌ కోచ్‌ లేని పాక్‌.. స్వదేశీ మాజీలు సక్లయిన్‌ ముస్తాక్‌, మిస్బా ఉల్‌ హాక్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌లను ట్రై చేసి వదిలేసింది. 

కాగా, కివీస్‌తో సిరీస్‌ కోసమని గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ను తాతాల్కిక హెడ్‌కోచ్‌గా నియమించిన పీసీబీ.. అతనికి డిప్యూటీగా తాజా మాజీ కోచ్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ను నియమించడం ఆసక్తికర అంశం. ఇలా చేయడం స్వదేశీ కోచ్‌ అయిన అబ్దుల్‌ రెహ్మాన్‌ను అవమానించడమేనని పాక్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. బ్రాడ్‌బర్న్‌తో పాటు పీసీబీ ఆండ్రూ పుట్టిక్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. ఆఫ్ఘనిస్తాన్‌్‌తో సిరీస్‌కు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన ఉమర్‌ గుల్‌ను కొనసాగించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement