
కరాచీ: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్‌ఎల్)లో మరోసారి కరోనా కలకలం రేపింది. పీఎస్‌ఎల్‌లో పాల్గొంటున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ అని తేలినా.. పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని పీసీబీ తెలిపింది. ఇదే విషయమై పీసీబీ డైరెక్టర్ ఆఫ్ మీడియా సామి బుర్నీ స్పందించాడు.
'లీగ్‌లో పాల్గొంటున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వచ్చిన వార్తలు నిజమే. మొత్తం అన్ని ఫ్రాంచైజీల్లో మొత్తం 242 పీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి చెందినవాడు కాగా.. మరో ఇద్దరు మిగతా ఫ్రాంచైజీల్లో ఉన్నారు. ఇంకా ఒక టీమ్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
కాగా పరిస్థితి అదుపులోనే ఉందని.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే బయో సెక్యూర్ బబూల్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికే కొత్త నిబంధనలకు సంబంధించి వివరాలను ఆయా ఫ్రాంచైజీలకు పంపించాం' అని తెలిపాడు. కాగా ఇస్లామాబాద్ యునైటెడ్ ఆటగాడు ఫాహిద్ అహ్మద్ సోమవారం కరోనా బారీన పడడంతో క్వెటా గ్లాడియేటర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.
చదవండి:
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్'
టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్ కోచ్
'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా'
Comments
Please login to add a commentAdd a comment