బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా
స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్ మహిళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమాలు కారు ప్రమాదానికి గురయ్యారు. కరాచీలోని పీసీబీ ట్రైనింగ్ క్యాంప్‌నకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో వారిద్దరి స్వల్ప గాయాయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను పీసీబీ వెల్లడించలేదు. కాగా ఏప్రిల్ 18న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన పాక్ ప్రిలిమనరీ జట్టులో బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా భాగంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పీసీబీ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో చెమటోడ్చుతున్నారు.
అయితే సరిగ్గా సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందు స్టార్ క్రికెటర్లు గాయపడటం నిజంగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు విండీస్‌తో పాక్ ఆడనుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.
BAD NEWS 🚨
— Female Cricket (@imfemalecricket) April 6, 2024
Pakistan batter Bismah Maroof and leg spinner Ghulam Fatima suffered minor injuries after being involved in a car accident.
They are currently under the care of the PCB medical team.#CricketTwitter pic.twitter.com/rZVlaCteu7
Comments
Please login to add a commentAdd a comment