
ఇస్లామాబాద్: సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్(తాత్కాలిక) సక్లయిన్ ముస్తాక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. హెడ్ కోచ్ పదవికి విదేశీయుడైతేనే కరెక్ట్ అని పీసీబీ ప్రకటన విడుదల చేసిన వెంటనే సక్లయిన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
పీసీబీ వ్యవహారిస్తున్న తీరు నచ్చకే సక్లయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, అతను మాత్రం వ్యక్తిగత కారణాల చేతనే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా, రమీజ్ రాజా పీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే నాటి హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచ్ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పాక్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
చదవండి: IND Vs SA 2nd Test: ఆరు టెస్ట్‌లు, ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు..!