బాబర్ ఆజంతో ఇమాద్ వసీం(PC: PCB)
Imad Wasim announces retirement: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. చాలా కాలంగా ఈ విషయంపై సమాలోచనలు చేస్తున్నానని.. అయితే రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు.
దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం కల్పించినందుకు పాక్ క్రికెట్ బోర్డు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటానని ఇమాద్ వసీం ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు.
అందరికీ థాంక్స్
అంతర్జాతీయ క్రికెటర్‌గా తన ఎదుగుదలలో తన కుటుంబానిది కీలక పాత్ర అన్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. వారి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇకపై ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా కనిపించకపోయినా.. ఆటను మాత్రం కొనసాగిస్తానని ఇమాద్ వసీం స్పష్టం చేశాడు.
అదే విధంగా.. కొత్త కోచ్‌లు, కొత్త నాయకుల రాకతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా మారుతుందని ఇమాద్ ధీమా వ్యక్తం చేశాడు. పాక్ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు.
కాగా 34 ఏళ్ల ఇమాద్ వసీం.. పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో 986, పొట్టి క్రికెట్‌లో 486 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 44, 65 వికెట్లు పడగొట్టాడు.
ఇక 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇమాద్ వసీం.. జట్టులో కీలక సభ్యుడిగా పేరొందాడు. చాంపియన్స్ ట్రోఫీ-2017 గెలిచిన పాక్ జట్టులో అతడు సభ్యుడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2016, వరల్డ్‌కప్-2019, టీ20 వరల్డ్‌కప్-2021 ఈవెంట్లలో కూడా పాల్గొన్నాడు.
— Imad Wasim (@simadwasim) November 24, 2023
కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగ్గా ఆడిన ఇమాద్.. స్పిన్ విభాగంలో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు.
వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో దక్కని చోటు
అయితే... అప్పటి చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం.. ఇమాద్ చాలా కాలంగా వన్డేలు ఆడటం లేదు కాబట్టి అతడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తేనే ఎవరికైనా ఛాన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో ఇమాద్ వసీం ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. అతడు చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో టీ20 సందర్భంగా పాక్ తరఫున మైదానంలో దిగాడు.
చదవండి: ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్ రన్నర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసి.. ఇలా..
Comments
Please login to add a commentAdd a comment