పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల (క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది. వరల్డ్‌కప్-2023లో వరుస వైఫల్యాలతో (6 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
కాగా, పాక్ లోకల్ న్యూస్ ఛానల్ "జియో న్యూస్" కథనం మేరకు పీసీబీలో ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్ భాగస్వామి అని తెలుస్తుంది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవినీతి జరిగి ఉంటుందని పాక్ ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఇంజమామ్‌పై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేస్త్నన్నట్లు ఇవాళ ప్రకటించాడు. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తున్న సందర్భంగా ఇంజమామ్ ఇలా అన్నాడు. ప్రజలు పరిశోధన లేకుండా మాట్లాడతారు. నాపై ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి నేను రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment