Inzamam ul Haq
-
టీమిండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ కెప్టెన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ టీమిండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించిన ఇంజీ.. తాజాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ భారత జట్టుకు మాత్రమే ప్రత్యేక రూల్స్ ఉన్నాయని అని కామెంట్ చేశాడు.సౌతాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నప్పుడు..భారత్ ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఎందుకు లేదని ప్రశ్నించాడు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో రూల్ ఎలా ఉంటుందని బీసీసీఐ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించాడు.ఐసీసీని బీసీసీఐ శాశిస్తుందని ఆరోపించిన ఇంజీ.. బీసీసీఐ ప్రపంచకప్ షెడ్యూల్‌ను టీమిండియాకు అనుగుణంగా తయారు చేయించుకుందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. భారత్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే నేరుగా ఫైనల్ చేరవచ్చవని బీసీసీఐ ముందే ప్లాన్ వేసిందని అన్నాడు. భారత్‌కు మాత్రమే లభించే ఇలాంటి బెనిఫిట్స్ (రిజర్వ్ డే లేకపోవడం) పాకిస్తాన్‌కు ఎప్పుడు లభించలేదని వ్యాఖ్యానించాడు.కాగా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నా.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోయినా అనూహ్య మార్పులేమీ జరగలేదు. రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌తో పోలిస్తే.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు అధికంగా ఉండినప్పటికీ.. వరుణ దేవుడు కటాక్షించడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇదే ఇంజమామ్‌కు మింగుడుపడటం లేదు అందుకే భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.అర్ష్‌దీప్ తన సెకెండ్ స్పెల్‌లో (16వ ఓవర్లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్‌ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్‌దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. -
CWC 2023: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల (క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది. వరల్డ్‌కప్-2023లో వరుస వైఫల్యాలతో (6 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాగా, పాక్ లోకల్ న్యూస్ ఛానల్ "జియో న్యూస్" కథనం మేరకు పీసీబీలో ప్లేయర్స్ మేనేజ్మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్ భాగస్వామి అని తెలుస్తుంది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవినీతి జరిగి ఉంటుందని పాక్ ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఇంజమామ్‌పై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేస్త్నన్నట్లు ఇవాళ ప్రకటించాడు. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తున్న సందర్భంగా ఇంజమామ్ ఇలా అన్నాడు. ప్రజలు పరిశోధన లేకుండా మాట్లాడతారు. నాపై ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి నేను రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. -
పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ ఉల్ హాక్
పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్.. ఆ దేశ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. గత వారమే పాకిస్తాన్ క్రికెట్ టెక్నికల్ కమిటీలో చేరిన ఇంజమామ్.. తాజాగా చీఫ్ సెలెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలో పాక్ ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌కు జట్లను ప్రకటిస్తుందని పీసీబీ ప్రతినిధి తెలిపారు. సెలెక్షన్ కమిటీలో ఇంజమామ్‌తో పాటు టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్‌కోచ్ బ్రాడ్‌బర్న్ ఉంటారని, ఇంజమామ్ వీరి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రతిపాదన మేరకు టీమ్ డైరెక్టర్, హెడ్ కోచ్‌లను సెలెక్షన్ ప్యానెల్లో కొనసాగించామని స్పష్టం చేశారు. ఇంజమామ్, ఆర్థర్, బ్రాడ్‌బర్న్ త్రయం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌లతో పాటు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా జట్టును ప్రకటిస్తారని తెలిపారు. మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హాక్ నేతృత్వంలోని పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీ ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని ప్రతిపాదించి, ఆమోదించిందని వెల్లడించారు. ఇంజమామ్ ఎంపికకు పీసీబీ చైర్మన్ జకా అష్రాఫ్ కూడా అమోద ముద్ర వేసారని అన్నారు. కాగా, ఇంజమామ్ గతంలో 2016 నుండి 2019 వరకు పాక్ నేషనల్ మెన్స్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్టు 2017లో సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్ అఫ్రిది
Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్ఎస్ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు. పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..! -
Inzamam-ul-Haq: పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. ఇప్పటికైనా వాళ్లు మారాలి!
Inzamam ul Haq Slams Bangladesh After Whitewash Against Pakistan T20 Series: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ విమర్శల వర్షం కురిపించాడు. సుదీర్ఘకాలంగా ఒకే జట్టును బరిలోకి దించుతున్నారని.. కొత్త వాళ్లకు అవకాశమే ఇవ్వడం లేదన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేయడం లేదని.. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి తగిన మార్పులు చేస్తే మెరుగైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత.. పాకిస్తాన్ వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతికి మొహమ్మద్ నవాజ్ ఫోర్ బాదడంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆట తీరుపై ఇంజమామ్ పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే.. ఇప్పటికీ ముగ్గురు.. నలుగురు ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది. గత ఆరేడేళ్లుగా ఇదే పరిస్థితి. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వారు మారడం లేదు. కొత్త ముఖాలు కనిపించడం లేదు. కొంతమంది కీలక ఆటగాళ్లు(షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఉద్దేశించి) కూడా ఈ సిరీస్ ఆడలేదు... ఇప్పటికైనా బంగ్లాదేశ్ క్రికెట్లో మార్పు రావాలి. ఆటను అభివృద్ధిపరచడంపై దృష్టి సారించాలి’’ అని హితవు పలికాడు. ఇక వైట్‌వాష్ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసలు కురిపించిన ఇంజమామ్... రోజురోజుకీ సారథిగా బాబర్ ఎంతో ఇంప్రూవ్ అవుతున్నాడని కితాబిచ్చాడు. చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్.. ఆట పట్టించిన శ్రేయస్.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్! -
Inzamam Ul Haq: గుండెపోటు రాలేదు.. కడుపు నొప్పితో వెళితే..!
లాహోర్: గుండెపోటుకు గురయ్యాడంటూ నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలను పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఖండించాడు. తనకెటువంటి గుండెపోటు రాలేదని, కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య విషయం బయటపడిందని తెలిపాడు. చికిత్సలో భాగంగా స్టంట్ వేసి సమస్యను పరిష్కరించారని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, కడుపులో కాస్త అసౌకర్యంగా ఉండడంతో ఇంజమామ్ సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా యాంజియోగ్రఫీ నిర్వహించగా.. రక్త నాళం ఒకటి కాస్త మూసుకుపోయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో స్టంట్ అమర్చి సమస్యను పరిష్కరించారు. 12 గంటల వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఇంజీ ఇంటికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పాక్ తరఫున 120 టెస్ట్‌లు, 378 వన్డేలు ఆడిన ఇంజీ.. ఇరవై వేలకు పైగా పరుగులు సాధించాడు. 2001-2007 మధ్యలో అతను పాక్ సారథిగా వ్యవహరించాడు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో ఇంజమామ్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: కేకేఆర్ బౌలర్‌కు గాయం.. సర్జరీ సక్సెస్ -
కోచ్, సహాయక సిబ్బంది లేకుండానే ఇండియా నాలుగో టెస్టు ఆడింది!
Inzamam-ul-Haq supports India’s take on Manchester Test: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజాముల్ హక్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడటం పట్ల భారత జట్టును తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా సోకిన నేపథ్యంలో ఓవల్ ట్రఫోర్డ్ మైదానంలో శుక్రవారం జరగాల్సిన నిర్ణయాత్మక మ్యాచ్ తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే. ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమాముల్ హక్.. టీమిండియా నిర్ణయం సరైనదేనని సమర్థించాడు. ‘‘సహాయక సిబ్బంది లేకుండా మైదానంలో దిగడం ఎంతో కష్టం. ఎవరైనా వ్యక్తి గాయపడినా, అస్వస్థతకు గురైనా ట్రెయినర్లు, ఫిజియోల అవసరం ఉంటుంది. వారి సహాయంతో కోలుకుని తిరిగి మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లో ఓ రోజు ఆట ముగిసిన వెంటనే ఫిజియోల పని మొదలవుతుంది. మరుసటి రోజు ఆట కోసం వారిని సంసిద్దులను చేయాల్సి ఉంటుంది. ఫిజియోలు, ట్రెయినర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దురదృష్టవశాత్తూ ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా ఆగిపోయింది. నిజానికి ఇది చాలా గొప్ప సిరీస్. కోచ్, సహాయక సిబ్బంది లేకుండానే భారత జట్టు నాలుగో టెస్టు ఆడింది. మైదానంలో వారు చూపిన ప్రతిభాపాటవాలు అసాధారణం. ఐదో మ్యాచ్‌ను నిరవధికంగా వాయిదా వేయడం సరైన నిర్ణయమే’’ అని ఇంజమాముల్ హక్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐదో టెస్టు రీషెడ్యూల్ విషయమై బీసీసీఐ- ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా నాలుగో టెస్టుకు ముందు బుక్లాంచ్కు హాజరైన హెడ్‌కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇతర కోచ్‌లు భరత్ అరుణ్, శ్రీధర్ ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Eng: కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ! -
మరి సచిన్‌కే ఎలా సాధ్యమైంది?: ఇంజీ
సచిన్ టెండూల్కర్.. భారత క్రికెట్లో ఒక సంచలనం. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలను సాధించిన ఏకైక క్రికెటర్. టెస్టుల్లో 51 శతాకాలు సాధించిన సచిన్.. వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ 1990లో మొదటి టెస్టు సెంచరీ, 1994 తొలి వన్డే సెంచరీ సాధించాడు. తన శకంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుల కొల్లగొడుతూ పరుగుల మోతమోగించాడు. సచిన్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. 200 టెస్టుల్లో 15, 921 పరుగులు సాధించగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు నమోదు చేశాడు. ఇక ఏకైక అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ సచిన్ ఆడాడు. తమ శకంలో సచిన్ ఒక అసాధారణ క్రికెటర్ అంటూ పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజమాముల్ హక్ ప్రశంసించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్లో సచిన్ గురించి పలు విషయాలను ఇంజమామ్ వెల్లడించాడు. అసలు సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును, పరుగుల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని ఉందన్నాడు. ‘ సచిన్ క్రికెట్ కోసమే పుట్టాడు. క్రికెట్-సచిన్‌లు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లే ఉంటుంది. 16-17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి దిగ్గజ బౌలర్లను సైతం సచిన్ వణికించాడు. కేవలం అతనికి మాత్రమే సాధ్యమైన రికార్డులతో క్రికెట్‌కు వన్నెతెచ్చాడు. మా టైమ్‌లో అసాధారణం అనేది ఏదైనా ఉందంటే అది సచిన్. ఎంతో మంది దిగ్గజ బౌలర్లకు సచిన్ దడపుట్టించాడు. వకార్ యూనస్, వసీం అక్రమ్ వంటి బౌలర్లకు సచిన్ తన 16 ఏళ్ల వయసులోనే చుక్కలు చూపించాడు. పేస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ఎటాక్ చేసేవాడు. అదే సమయంలో రికార్డుల మోత మోగించాడు. ఆ శకంలో పరుగులు చేయడమంటే అంత ఈజీ కాదు. అప్పటివరకూ సాధారణంగా మొత్తమన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల లోపు పరుగులు చేస్తేనే అదొక గొప్ప విషయం. సునీల్ గావస్కర్ సాధించిన 10వేల పరుగులే అప్పట్లో గొప్ప. ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అనుకోలేదు. కానీ సచిన్ వరుసగా అన్ని రికార్డులను కొల్లగొట్టుకుంటూ పోయాడు. మరి సచిన్‌కే అది సాధ్యమైందంటే క్రికెట్ దేవుడే కదా. ఇక ఇప్పుడు సచిన్ రికార్డులను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని ఉంది’ అని ఇంజమామ్ తెలిపాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే సచిన్ లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ ఉండేవాడు. మూడు రకాలుగా బౌలింగ్ వేయడంలో మంచి నైపుణ్యాన్ని సచిన్ ప్రదర్శించేవాడు. భారత్ బౌలింగ్‌లో సచిన్ వేసే గుగ్లీలే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. అతనికే చాలా సార్లు ఔటయ్యాను కూడా’ అని సచిన్ బౌలింగ్ గురించి ఇంజీ చెప్పుకొచ్చాడు. -
చిత్ర విచిత్ర రనౌట్లు!
బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతుంటారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ వింతగా, నిర్లక్ష్యంగా రనౌట్ అవ్వడం తెలిసిందే. అయితే క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు కోకొల్లలు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇంజమాముల్ హక్, మిస్బావుల్ హక్, మహ్మద్ అమిర్, టీమిండియా బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్, అలిస్టర్ కుక్, శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీథరన్‌లు ఉన్నారు. క్రీజులో పాతుకపోతున్నారు, ఇక గెలిచినట్టే అన్న తరుణంలో సిల్లీగా రనౌట్లు అవ్వడం అటు జట్టుకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు కామనే. కానీ టెస్టుల్లో, వన్డేల్లో మధ్య ఓవరల్లో నిర్లక్ష్యంతో రనౌటవ్వడం అందరికీ కోపాన్ని కలిగించే అంశం. వినూత్నంగా రనౌటవ్వడంలో పాక్ మాజీ సారథి ఇంజమాముల్ హక్ తొలి స్థానంలో ఉంటాడు. అందులోనూ కామెడీగా రనౌట్లయినవి 23 వరకు ఉండటం గమనార్హం. టీమిండియాతో వన్డే మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న ఇంజమామ్.. ఫీల్డర్ వికెట్ల వైపు విసిరిన బంతిని అడ్డుకోవడంతో అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. అప్పుడు ఇలాంటి రనౌట్లు కూడా ఉంటాయా అని అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మిస్బావుల్ హక్, అమిర్, అజహర్ అలీలు కూడా ఫన్నీగా రనౌటయ్యారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్‌కు పరుగెత్తడం కన్నా బౌండరీలు బాదడం ఈజీ అనుకుంటాడు. 2007లో శ్రీలంక నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఫామ్‌లో ఉన్న సెహ్వాగ్ సిల్లీగా రనౌటవ్వడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. 2011లో టీమిండియాతో టెస్టు సందర్భంగా బంతి బౌండరీ దాటిందని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ పిచ్ మధ్యలో సహచర బ్యాట్స్‌మన్‌తో రిలాక్స్ అవుతున్నాడు. అయితే బౌండరీ వద్ద బంతి అందుకున్న ఫీల్డర్ ప్రవీణ్ కుమార్, కీపర్ ధోని సహకారంతో బెల్‌ను రనౌట్ చేశాడు. దీంతో షాక్‌లోనే బెల్ మైదానాన్ని వీడాల్సివచ్చింది. 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్-టీమిండియా టెస్టు సందర్భంగా ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మన్ కుక్ భయంతో సిల్లీగా అవుటయ్యాడు. సింగిల్ తీస్తున్న క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతిని భయంతో తప్పించకోబోయి రనౌటగా వెనుదిరుగుతాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత సిల్లీ రనౌట్ అంటే ముత్తయ్య మురళీథరన్దే అని చెప్పవచ్చు. 2006లో న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్‌లో ఈ కామెడీ రనౌట్ చోటుచేసుకుంది. వరుసగా వికెట్లు పడుతుంటే ఒంటరి పోరాటం చేస్తున్న కుమార సంగక్కర ఒక్క పరుగు తీస్తే సెంచరీ పూర్తవుతుంది. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న సంగక్కర సింగిల్ తీసి శతకం అభివాదం చేస్తుండగానే అవతలి ఎండ్‌లో మురళీధరన్ అవుటని అంపైర్ ప్రకటించాడు. దీంతో సంగక్కర షాక్‌కు గురయ్యాడు. సహచర ఆటగాడిని అభినందించాలనే తొందరలో స్పిన్ మాంత్రికుడు సిల్లీగా రనౌటయ్యాడు. -
క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు
-
భారత్ నుంచి పాక్ ఎలాగైనా సాధిస్తుంది!
పాకిస్తాన్ తో భారత్ టెస్టులు ఆడకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని పాక్ క్రికెట్ చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ న్ వెనక్కినెడుతూ భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. దీనిపై ఇంజీ స్పందిస్తూ.. భారత్ తో మ్యాచ్ లు లేకపోతేనేం.. మాకేం నష్టం లేదు. ఇతర జట్లపై పాక్ విజయాలు సాధించి భారత్ నుంచి అగ్రస్థానాన్ని తిరిగి లాగేసుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు. భారత్ తో వన్డే, టెస్టు సిరీస్ లు ఆడిన పాక్ జట్టుకు తాను కెప్టెన్ గా వ్యవహరించానని, ఈ మ్యాచ్ లు ఎంతముఖ్యమో తనకు తెలుసునన్నాడు. భారత్ స్వదేశంలో త్వరలో మరో 13 టెస్టులు ఆడనుండగా, తమ జట్టు మాత్రం 2009 నుంచి స్వదేశంలో మ్యాచ్ ఆడటంలేదని ఇంజమామ్ వాపోయాడు. భారత్ విదేశాల్లో సిరీస్ లు నెగ్గలేదని, పాక్ మాత్రం ఎక్కడైనా రాణిస్తుందని చెప్పాడు. ఇంగ్లండ్ లో భారత్ ఓటమిపాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. పాక్ కేవలం ఆస్ట్రేలియా గడ్డపైనే ఇబ్బందులు ఎదుర్కొంటుందని వివరించాడు. -
'పాక్‌లో టీమిండియా వద్ద ఒక్కపైసా తీసుకోలేదు'
న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్.. బద్ధ విరోధులైన భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లకు ఒకప్పుడు ఒకేసారి నేతృత్వం వహించిన కెప్టెన్లు. ఈ ఇద్దరు తాజాగా ఓ టీవీ చానెల్ నిర్వహించిన క్రికెట్ షోలో మనస్సు విప్పి మాట్లాడారు. భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ను పునరుద్ధరించాలని, ఇది ఇరుదేశాల సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు. తాము క్రికెట్ ఆడుతున్న రోజుల్లో భారత్-పాక్ మ్యాచులప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హక్ మాట్లాడుతూ 'భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌లు మళ్లీ జరగాలి. క్రికెట్ సంబంధాలు ఇరుదేశాలకు మేలు చేస్తాయి. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. ఇరుదేశాల ప్రజలు కూడా క్రికెట్ మ్యాచులు జరగాలని కోరుకుంటున్నారు. వాళ్లు క్రికెటర్లను, క్రికెట్ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తారు' అని చెప్పాడు. 'రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో సోదరభావం ఉంది. 2004లో భారత జట్టు పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు.. వారు పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో తిన్నారు. కానీ ఎవ్వరు కూడా వారి నుంచి డబ్బు తీసుకోలేదు. భారత క్రికెటర్లు షాపింగ్ వెళ్లినప్పుడు కూడా పాక్ ఆటగాళ్లు వెంట ఉండేవారు. వారికి ప్రాంతాలన్నీ తిరిగి చూపించేవారు. దుకాణదారులు కూడా వారి నుంచి పైసా తీసుకోలేదు' అని హాక్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ధర్మశాలలో భారత్-పాక్ టీ-20 మ్యాచు గురించి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన హక్.. అక్కడ మ్యాచ్ జరుగాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. గంగూలీ మాట్లాడుతూ దాయాది పాక్‌తో క్రికెట్ ఆడటం ఎప్పుడూ ఆనందంగానే ఉండేదని, అప్పట్లో తమ రెండు జట్లు ప్రపంచంలో ఉత్తమ జట్లుగా ఉండటంతో ఆట పోటాపోటీగా ఉండేదని చెప్పాడు. 'వ్యక్తిగతంగా వారితో మాకు శత్రుత్వం ఉండేది కాదు. కానీ రెండు జట్లు ఆడినప్పుడు బలమైన పోటీతత్వం మాత్రం ఉండేది. పాక్‌కు బలమైన లైనప్ ఉంది. ఇంజీ కూడా బాగా ఆడేవాడు. ఇజాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్, షాహిద్ ఆఫ్రిది, మొయిన్ ఖాన్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్ ఉండేవారు. ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు వాళ్ల జట్టులో ఉండేవారు. ఆ జట్టులో బలహీనత కనిపెట్టడం చాలా కష్టంగా ఉండేది. వాళ్లతో ఆడటం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇచ్చేది' అని గంగూలీ చెప్పాడు. 'నా కెప్టెన్సీ కెరీరంతా పాక్ కెప్టెన్‌గా ఇంజీ భాయే ఉన్నాడు. నేను ఆయన బ్యాటింగ్‌కు అభిమానిని. 2004 భారత్-పాక్ సిరీస్ నాకు ఇంకా గుర్తుంది. ఆయనను ఔట్ చేయడం మాకు ఎంతో కష్టంగా అనిపించేంది. కరాచీలో జరిగిన మొదటి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన మేం 340కిపైచిలుకు పరుగులు చేశాం. పాక్ 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. మేం గెలుస్తామని భావించాం. కానీ ఇంజీ వచ్చి మ్యాచ్ గతిని మార్చాడు. చివరి ఓవర్లో మొయిన్ ఖాన్ కొన్ని పరుగులు చేసినా మేం ఆ మ్యాచులో ఓడిపోయేవాళ్లమే' అని గంగూలీ చెప్పాడు.