పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ టీమిండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించిన ఇంజీ.. తాజాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ భారత జట్టుకు మాత్రమే ప్రత్యేక రూల్స్ ఉన్నాయని అని కామెంట్ చేశాడు.
సౌతాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నప్పుడు..భారత్ ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఎందుకు లేదని ప్రశ్నించాడు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో రూల్ ఎలా ఉంటుందని బీసీసీఐ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఐసీసీని బీసీసీఐ శాశిస్తుందని ఆరోపించిన ఇంజీ.. బీసీసీఐ ప్రపంచకప్ షెడ్యూల్‌ను టీమిండియాకు అనుగుణంగా తయారు చేయించుకుందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. భారత్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే నేరుగా ఫైనల్ చేరవచ్చవని బీసీసీఐ ముందే ప్లాన్ వేసిందని అన్నాడు. భారత్‌కు మాత్రమే లభించే ఇలాంటి బెనిఫిట్స్ (రిజర్వ్ డే లేకపోవడం) పాకిస్తాన్‌కు ఎప్పుడు లభించలేదని వ్యాఖ్యానించాడు.
కాగా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నా.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోయినా అనూహ్య మార్పులేమీ జరగలేదు. రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌తో పోలిస్తే.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు అధికంగా ఉండినప్పటికీ.. వరుణ దేవుడు కటాక్షించడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ సాగింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇదే ఇంజమామ్‌కు మింగుడుపడటం లేదు అందుకే భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment