
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 29 ఏళ్ల తర్వాత తమ దేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
దీంతో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో తమ సెమీస్ బెర్త్‌ను బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడుతోంది.
భద్రత కారణాల రీత్యా తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ విషం చిమ్మాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పక్కన పెట్టండి. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ ఐపీఎల్‌లో పాల్గోంటారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గోనరు. అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు. కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు ఎన్‌వోసీ జారీ చేయకూడదు. ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపై రావాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ పేర్కొన్నాడు.
అయితే ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్(2008) లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడారు.
అయితే ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధించారు. కాగా బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందకు అనుమతించదు. ఒక ఇండియన్ క్రికెటర్ ఓవర్సీస్ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాలంటే ఐపీఎల్‌తో సహా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి.
చదవండి: CT 2025 IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment