
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై కరోనా తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో పీసీబీ తక్కువ ధరకే లోగో హక్కుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. స్వల్ప మొత్తానికే ట్రాన్స్ మీడియా కంపెనీ ఏడాదిపాటు పాక్ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. పీసీబీకి పాక్ కరెన్సీలో 20 కోట్లు ట్రాన్స్‌మీడియా ఇవ్వనుంది. పెప్సీతో పీసీబీ కుదుర్చుకున్న మూడేళ్ల ఒప్పందం ఇటీవల ముగిసింది. మూడేళ్ల కాలానికి పీసీబీకి పెప్సీ రూ. 91 కోట్లు చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment