టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్‌ జట్టుకు భారీ షాక్.. | T20 World Cup 2021: Grant Bradburn Steps Down As PCB Head Of High Performance Coaching | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్‌ జట్టుకు భారీ షాక్..

Published Fri, Oct 15 2021 7:50 PM | Last Updated on Sat, Oct 16 2021 5:45 PM

T20 World Cup 2021: Grant Bradburn Steps Down As PCB Head Of High Performance Coaching - Sakshi

Grant Bradburn Steps Down As PCB High Performance Coach: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌, పాక్‌ జట్ల మధ్య అక్టోబర్ 24న జరగనున్న హై ఓల్టేజ్‌ పోరుకు ముందు పాక్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)తో ఒప్పందం కాలం ముగియడంతో ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు. 

ఈ సందర్భంగా బ్రాడ్‌బర్న్ పీసీబీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు. పాక్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పని చేయడం గర్వించదగ్గ విషయమని, ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పీసీబీ థ్యాంక్స్ అని తెలిపాడు. 2018 సెప్టెంబర్ నుంచి 2020 జూన్ వరకు పాక్‌ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రాడ్‌బర్న్.. ఆ తర్వాత పాక్‌ హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్‌గా నియమితుడయ్యాడు.

ఇదిలా ఉంటే, పీసీబీ ఛైర్మన్‌గా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ చేసిన ఐదో కీలక వ్యక్తి బ్రాడ్‌బర్న్ కావడం విశేషం. ఇతని కంటే ముందు పాక్‌ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్, సీఈఓ వసీం ఖాన్‌లతో పాటు మార్కెటింగ్ హెడ్ బాబర్ హమీద్ రాజీనామా చేశారు. వీళ్లంతా రమీజ్ రాజా ఒత్తిడి తట్టుకోలేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన బ్రాడ్‌బర్న్ 1990 నుంచి 2001 వరకు న్యూజిలాండ్ తరఫున 7 టెస్ట్‌లు, 11 వన్డేలు ఆడాడు. 
చదవండి: IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్‌కే ఆటగాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement