ఇంజమామ్ ఉల్ హక్- ఇమాద్ వసీం (PC: PCB)
ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్.. స్పిన్ దళంలో ఒకడిగా తప్పక టీమ్‌లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఇమాద్ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం
‘‘చాలా రోజులుగా ఇమాద్ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవాల్సిందే.
అందుకే అతడికి చోటు లేదు
డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్ క్రైటీరియా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్ వసీం జూనియర్ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు.
అనూహ్య రీతిలో ఉస్మా మీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడుతున్న ఇమాద్ వసీం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు.
చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?
🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023
Comments
Please login to add a commentAdd a comment