
సాక్షి, బొమ్మనహళ్లి: సినిమాలో నటించిన హీరోతో నీకు సంబంధం ఉందంటూ అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్న సహాయ నటుడిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బొమ్మనహళ్లి నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నటుడు రాజశేఖర్ ఐస్ మహల్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటించిన ఓ హీరో యిన్‌ను రాజశేఖర్ అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు.
దీంతో ఆమె అతని వేధింపులు భరించలేక మాగడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.