‘మేడం..మేడం మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం.. నాలుగు డజన్ల కోడిగుడ్లు రూ.49కే అందిస్తాం’ అంటూ ఓ మహిళకు మెయిల్ వెళ్లింది. ఆ తర్వాత ఏమైందంటే?
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని అటు పోలీసులు, ఇటు సోషల్ మీడియాలో సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలువురు మోసాల బారిన పడుతున్నారు. భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకున్న తర్వాత లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు.
తాజాగా, బెంగళూరులోని వసంత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫిబ్రవరి 17న మెయిల్ వచ్చింది. అందులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ తక్కువ ధరకే కోడిగుడ్లను అందిస్తుంది. అందులో కోళ్ల పెంపకం, కోడిగుడ్ల డెలవరీ గురించి ఓ రెండు మూడు లైన్లు ఆకట్టుకునే కంటెంట్. ఇంకేముంది ఆ అడ్వటైజ్మెంట్ మెయిల్ చూసిన సదరు మహిళకు సంతోషం తట్టుకోలేకపోయింది.
అమ్మో..! రూ.49కే నాలుగు డజన్ల కోడిగుడ్లా.. వెంటనే కొనేయాలి. లేదంటే ఆఫర్ మిస్సవుతుందంటూ ఆ మెయిల్ ఓపెన్ చేసింది. అందులో షాపింగ్ లింక్‌ను క్లిక్ చేసి నాలుగు డజన్ల కోడిగుడ్లను రూ.49కే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. కానీ పేమెంట్ కాకపోగా.. ఆమె బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు కావాలంటూ పక్కనే గూగుల్ ఫోరం తరహాలో ఓ ఫోల్డర్ కనిపించడం, వెంటనే వివరాల్ని ఇవ్వడం అంతా క్షణాల్లో పూర్తి చేసింది.
అనంతరం, క్రెడిట్ కార్డ్‌తో మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంది. వెంటనే తన క్రెడిట్ కార్డ్ సాయంతో రూ.49 చెల్లించింది. ఇంకేముందు సైబర్ కేటుగాళ్లు తమ పనిని మొదలు పెట్టారు. ఫలితంగా బ్యాంక్ అకౌంట్‌లలో ఉన్న 10 రెట్ల డబ్బును అంటే రూ. 48,199 మాయం చేశారు.
బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం సదరు బ్యాంక్‌కి కాల్ చేసి క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆశకు హద్దుండాలి కదమ్మా..రూ.49కే 48గుడ్లు ఇస్తున్నామంటే? మీరెలా నమ్మారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment