సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా పలు కోర్టుల్లో వాదనలు వర్చువల్‌గా కొనసాగుతున్నాయి. హైకోర్టులో వర్చువల్‌గా వాదనలు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించిన వ్యక్తి అర్ధనగ్నంగా వర్చువల్ వాదనలకు హాజరయ్యాడు. ఈ ఘటన కర్ణాటక హైకోర్టులో చోటుచేసుకుంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ హైకోర్టులో వర్చువల్ వాదనలు జరుపుతున్న సమయంలో సదరు వ్యక్తి అర్ధ నగ్నంగా కనిపించడంతో ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేశారు.
చదవండి: Omicron Variant: కొత్త వేరియంట్ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్‌డౌన్: ఆరోగ్యమంత్రి
‘వాదనలు వినిపిస్తున్న సమయంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి అర్ధనగ్నంగా స్క్రీన్‌పై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిపై అధికారికంగా కోర్టు ధిక్కరణ, లైంగిక వేధింపుల కింద ఫిర్యాదు చేశాను. ఇది కచ్చితంగా వాదనలను అడ్డుకునే ప్రయత్నం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే న్యాయవాది ఇందిరా జైసింగ్ ఫిర్యాదు మేరకు కర్ణాటక హైకోర్టు ఆ వ్యక్తికి నోటిసులు జారీ చేసింది.
I confirm that a semi naked man was visible on the screen for a full 20 minutes despite my objection . I am making an official complaint for contempt of court snd sexual harassment. It’s extremely disturbing in the middle of an argument in court https://t.co/q9DAgoHze7
— Indira Jaising (@IJaising) November 30, 2021
Comments
Please login to add a commentAdd a comment