
ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటక: ఎంత కష్టం వచ్చినా కాపాడాల్సిన తల్లి క్షణికావేశంలో హంతకిగా మారింది. ఇద్దరు పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మత్తూరు సమీపంలోని నడుపనట్టి గ్రామానికి చెందిన వెంకటేషన్ (39). ఇతనికి తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన గాయత్రి (32)తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కనిష్కా (7), శరవణ్ (4) అనే పిల్లలున్నారు.
వెంకటేష్ తిరుపతిలో టోపీల వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే నెలల తరబడి ఉండేవాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గాయత్రి తన ఇద్దరు పిల్లలను ఉరికి వేలాడదీసి హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొంది. అత్త ఉదయలక్ష్మి చూసి మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఊత్తంగేరి డీఎస్పీ అలెగ్జాండర్ కేసు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment