woman suicide case
-
ఏమైందో ఏమో.. కన్నతల్లే కాలయముడు అయింది.. ఆపై
కర్ణాటక: ఎంత కష్టం వచ్చినా కాపాడాల్సిన తల్లి క్షణికావేశంలో హంతకిగా మారింది. ఇద్దరు పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మత్తూరు సమీపంలోని నడుపనట్టి గ్రామానికి చెందిన వెంకటేషన్ (39). ఇతనికి తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన గాయత్రి (32)తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కనిష్కా (7), శరవణ్ (4) అనే పిల్లలున్నారు. వెంకటేష్ తిరుపతిలో టోపీల వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే నెలల తరబడి ఉండేవాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గాయత్రి తన ఇద్దరు పిల్లలను ఉరికి వేలాడదీసి హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొంది. అత్త ఉదయలక్ష్మి చూసి మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఊత్తంగేరి డీఎస్పీ అలెగ్జాండర్ కేసు విచారణ చేపట్టారు. -
ఎంత పని చేశావు.. అమ్మ
సాక్షి, ఆదిలాబాద్ : క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న మమ్మల్ని విడిచి కానరాని లోకాలకు వెళ్లి ఎంత పని చేశావు అమ్మ.. అని అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారుల చూపులు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామానికి చెందిన పస్పుల శరణ్యరాణి (24) ఈ నెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. ఇంటి పక్కన గల వ్యక్తి మద్యం సేవించి శరణ్యను బూతులు తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త వెంకటేశ్, మామ రామన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శరణ్య అత్త లక్ష్మి గతంలోనే మృతి చెందింది. అప్పటి నుంచి మామ రామన్న తనను కోడలు మంచిగా చూసుకోవడం లేదని గ్రామస్తులతో చెప్పడంతోనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని శరణ్య తండ్రి ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు పేర్కొన్నారు. శరణ్యకు నాలుగేళ్ల కూతురు, కొడుకు ఉన్నారు. భర్త వెంకటేశ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
‘నా భార్య మృతికి జడ్జియే కారణం’
సాక్షి, వరంగల్ : తన భార్య తలుగుల టీనా మృతికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అనిరోజ్ క్రిష్టియానా కారణమని మృతురాలి భర్త రవి ఆరోపించారు. శుక్రవారం కోర్టు ఎదుట టీనా మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు. జడ్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జులైవాడకు చెందిన టీనా న్యాయసేవాధికార సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. జడ్జి క్రిష్టియానా మానసిక వేధింపులు, సహచర ఉద్యోగుల ఎదుట అవమానిస్తుండటంతో కలత చెందిన టీనా.. గతేడాది సెప్టెంబర్ 26న న్యాయసేవా సదన్ భవనంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరింది. మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో అనేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం దక్కలేదు. టీనా వైద్య ఖర్చులు నిమిత్తం ఇల్లును విక్రయించామని రవి సుబేదారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం టీనా తుదిశ్వాస విడిచింది. కోర్టు ఎదుట బైఠాయింపు కాగా, టీనా మృతదేహంతో కోర్టు గేటు ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మార్పీఎస్ నేతలు బైఠాయించారు. మధ్యాహ్నం మొదలైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. టీనా మృతికి కారణమైన జడ్జిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త రవి, కుమారుడు సంజీవ్ ఒక దశలో జడ్జి చాంబర్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన జడ్జి తిరుమలాదేవి ప్రతినిధిగా సూపరింటెండెంట్ రవికాంత్ బాధితుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. -
మాయమయ్యిందా.. మాయం చేశారా?
♦ యువతి ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన సెల్‌ఫోన్ ♦ కనిపించకుండా పోవడంపై అనుమానాలు ♦ పోలీసుల అదుపులో నిందితులు తూర్పు గోదావరి : కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కే శిరీష (19) ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమెకు చెందిన సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ఆమె చనిపోయినప్పటి నుంచి సెల్‌ఫోన్ కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ప్రేమించి మోసం చేసినట్టు చెబుతున్న నిందితుడికి సంబంధించిన ఈమెయిల్స్, ఫేస్బుక్ అకౌంట్స్, వాట్సాప్‌కు సంబంధించిన సమాచారం ఆఫోన్లో ఉంటుందని మృతురాలి బంధువులు, స్నేహితులు చెబుతుండగా ఆఫోన్ మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ ఆమె వద్దే ఉండే సెల్‌ఫోన్ ఆత్మహత్య చేసుకున్నాక గల్లంతవ్వడం, ఆ నంబర్‌కు కాల్ చేస్తే రింగయినా ఎవరూ రిసీవ్ చేసుకోపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆసెల్ఫోన్ కోసం మృతురాలి ఇంట్లో సోదాలు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి సోదాలు చేసి లేదా నెట్వర్క్ ద్వారా సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కునే పనిలో ఉన్నారు. శిరీష చనిపోయే ముందు తన ఫోన్ ఎక్కడైనా పెట్టి వదిలేసిందా ? లేక ఆ హడావుడిలో ఎవరైనా దానిని తీసి ఎవరికైనా ఇచ్చారా? ముందు రింగయిన సెల్ తరువాత స్విచ్ఛాఫ్ కావడం చార్జింగ్ అయిపోవడం వల్లా లేక ఎవరైనా ఆపేసారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌ను ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కేవలం ప్రేమ విఫలం అవ్వడం వల్లే శిరీష మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమె సూసైడ్ నోట్లో తన చావుకు కారణంగా చెబుతూ పేర్కొన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిఠాపురం సీఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిసింది. ‘తల్లి’డిల్లే తనువు చాలించిందా ? ప్రేమించానని నమ్మించి శారీరకంగా అవసరం తీర్చుకుని వదిలేయడం వల్ల తల్లి కాబోతున్నానన్న చేదు నిజం తెలిసి తట్టుకోలేకే ఆమె తనువు చాలించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆ అనుమానంతోనే గర్భ నిర్ధారణకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి సమాజంలో అనేక రకాలు మనుషులు ఉంటారు. కొందరు తమ అవసరాలు తీర్చుకోడానికి అనేక వక్రమార్గాలు పడతారు.అటువంటి వారి బారిన పడినప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను హరించడంతో పాటు ఆ కుటుంబాలను వీధుల పాలు చేస్తాయి. శిరీష మాదిరిగా ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టం, న్యాయం ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. తమ బాధను పోలీసులకు చెప్పుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విద్యావంతులు కూడా ఇలా అనాలోచిత చర్యలకు పాల్పడ కూడదు. ఎవరు మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం అని సీఐ అప్పారావు సూచించారు.