కూతురు, కొడుకుతో శరణ్యరాణి(ఫైల్) శరణ్యరాణి (ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్ : క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న మమ్మల్ని విడిచి కానరాని లోకాలకు వెళ్లి ఎంత పని చేశావు అమ్మ.. అని అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారుల చూపులు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామానికి చెందిన పస్పుల శరణ్యరాణి (24) ఈ నెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది.
ఇంటి పక్కన గల వ్యక్తి మద్యం సేవించి శరణ్యను బూతులు తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త వెంకటేశ్, మామ రామన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శరణ్య అత్త లక్ష్మి గతంలోనే మృతి చెందింది. అప్పటి నుంచి మామ రామన్న తనను కోడలు మంచిగా చూసుకోవడం లేదని గ్రామస్తులతో చెప్పడంతోనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని శరణ్య తండ్రి ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు పేర్కొన్నారు. శరణ్యకు నాలుగేళ్ల కూతురు, కొడుకు ఉన్నారు. భర్త వెంకటేశ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment