ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ రంగుల వెండితెరపై నటించే అనేక మంది చిత్ర నటులు, కళాకారులు నిజజీవితంలో మాత్రం ఆర్థిక కష్టాలతో దయనీయ జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా కొన్ని వందల చిత్రాల్లో అన్ని తరహా పాత్రలను పోషించి కన్నడ ప్రేక్షకుల మన్నన పొందిన అలనాటి నటుడు కే.ఎస్.అశ్వథ్ కుమారుడు శంకర్ అశ్వథ్ కూడా అవకాశాల కొరత కారణంగా ఇదేస్థితిలోనున్నారు. జూనియర్ అశ్వథ్ ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా జీవితం నెట్టుకొస్తున్న వైనం సినీ ప్రేక్షకులకు, అభిమానులకు ఆవేదన కలిగిస్తున్నా అది పచ్చినిజం.