
టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు సాధించిన సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) జంట బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ అర్జున్ ద్వయం 6–3, 3–6, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్–సొంచాట్ రటివటానా (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొందింది. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒకదశలో సాకేత్ జంట 1–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకున్న ఈ భారత జంట స్కోరును 9–9తో సమం చేసింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment