saketh pair
-
బెంగళూరు ఓపెన్ డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్ జంట
టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు సాధించిన సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) జంట బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ అర్జున్ ద్వయం 6–3, 3–6, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్–సొంచాట్ రటివటానా (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొందింది. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒకదశలో సాకేత్ జంట 1–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకున్న ఈ భారత జంట స్కోరును 9–9తో సమం చేసింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
రజతంతో సరిపెట్టుకున్న సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ మైనేని- సనామ్ సింగ్ లు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధాయ్ లాండ్ ఆటగాళ్లపై విజయం సాధించిన ఈ జోడీ.. ఫైనల్ రౌండ్ లో మాత్రం చతికిలబడ్డారు. సోమవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో సాకేత్ జోడీ 5-7,6-7 తేడాతో దక్షిణా కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూ లిమ్ మరియ హెన్ చుంగ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కేవలం గంటా 29 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ పోరులోభారత్ ఆటగాళ్లు ఏ దశలోనూ దక్షిణ కొరియా పై పైచేయి సాధించలేదు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ లాండ్ జంటను మట్టికరిపించింది. -
ఫైనల్ కు చేరిన సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరింది. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ జంటను మట్టికరిపించింది. భారత్ జోడీ 4-6, 6-3, 10-6 తేడాతో థాయ్ జోడీ సంచాయ్, సంచోత్ రతి వతనాలను కంగుతినిపించింది. కేవలం ఒక గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సాకేత్ జోడీ తొలి సెట్ ను కోల్పోయింది. అయితే అనంతరం అనూహ్యంగా పుంజుకున్న ఈ జోడీ వరుస రెండు సెట్ లను గెలుచుకుని భారత్ కు మరో రజత పతకాన్ని ఖాయం చేశారు. మరో సెమీఫైనల్లో దక్షిణాకొరియా విజయం సాధించి భారత్ పో్రుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో గెలిచి టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని అందించడానికి సాకేత్ జోడీ ఉవ్విళ్లూరుతోంది.