రజతంతో సరిపెట్టుకున్న సాకేత్ జోడీ | India win silver in men's doubles tennis | Sakshi
Sakshi News home page

రజతంతో సరిపెట్టుకున్న సాకేత్ జోడీ

Published Mon, Sep 29 2014 3:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

India win silver in men's doubles tennis

ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ మైనేని- సనామ్ సింగ్ లు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధాయ్ లాండ్ ఆటగాళ్లపై విజయం సాధించిన ఈ జోడీ.. ఫైనల్ రౌండ్ లో మాత్రం చతికిలబడ్డారు. సోమవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో సాకేత్ జోడీ 5-7,6-7 తేడాతో దక్షిణా కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూ లిమ్ మరియ హెన్ చుంగ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కేవలం గంటా 29 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ పోరులోభారత్ ఆటగాళ్లు ఏ దశలోనూ దక్షిణ కొరియా పై పైచేయి సాధించలేదు.
 

ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ లాండ్ జంటను మట్టికరిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement