
చేతన (ఫైల్)
సాక్షి, బెంగళూరు : ప్రేమించాలంటూ యువకుని వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదివారం శివమొగ్గ పట్టణంలో చోటు చేసుకుంది. శివమొగ్గలోని వెంకటేశ్‌నగర్‌కు చెందిన చేతన (19) అక్కడే ఓ బీపీఓ సంస్థలో పనిచేస్తోంది. చేతన పనిచేస్తున్న కార్యాలయం వద్ద మొబైల్ దుకాణ యజమాని శ్రీనివాస్ ప్రేమించాలంటూ చేతనను వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆమె పలుమార్లు స్పష్టంచేసింది. అయినా వెంటాడుతూ బెదిరింపులకు పాల్పడడంతో అమ్మాయి తీవ్ర ఆవేదనకు లోనైంది. తన బాధను ఇంట్లో చెప్పుకోలేక, జీవితంపై విరక్తి చెందింది. చేతన ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న జయనగర పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment