Shocking CCTV Footage: Kids Repeatedly Hitting Another Kid In Pre-School At Bengaluru Video Goes Viral - Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ ఇలాంటి స్కూల్‌లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్‌ వీడియో

Published Sat, Jun 24 2023 12:33 PM | Last Updated on Sat, Jun 24 2023 1:18 PM

Kids Repeatedly Hitting Another In Pre-School At Bangalore Video Viral - Sakshi

బెంగళూరు: పేరెంట్స్‌ మీ పిల్లలను ప్రీ స్కూల్స్‌కు పంపిస్తున్నారా?. అయితే, ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మీ బిడ్డ చదువుతున్న స్కూల్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒక్కసారి కచ్చితంగా తెలుసుకోంది. ఈ వీడియోలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రీ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో ఓ కుర్రాడు మరో చిన్నారిపై దాడి చేశాడు. ఈ వీడియో బాధిత చిన్నారి తల్లి కంటతడి పెట్టింది. ఇక, ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. చిక్కలసండ్రలోని టెండర్ ఫూట్ ప్రీ స్కూల్‌లోని ఓ రూమ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో క్లాస్ రూంలో నుంచి ఓ టీచర్, ఆయా బయటకు వెళ్లడంతో ఓ బాలుడు మరో చిన్నారిని కొట్టడం ప్రారంభించాడు. చేతులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. మధ్యలో క్లాస్ రూం కిటికీలో నుంచి టీచర్ వస్తున్నది లేనిదీ చూసుకుంటూ పదే పదే చిన్నారిపై దాడి చేశాడు. ఆ చిన్నారిని కింద పడేసి కాళ్లతో తన్నడం, మెడ కొరకడం వంటివి చేశాడు. ఇక, ఇదంతా క్లాస్‌రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 

ఈ విషయం బాధిత చిన్నారి పేరెంట్స్‌కు తెలియడంతో పిల్లలను అలా వదిలేసి వెళ్లడంపై తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. తలుపు వేసి ఉన్న రూంలో పిల్లలను ఎలా వదిలేశారని మండిపడ్డారు. అనంతరం, ఈ ఘటనపై చిన్నారి పేరెంట్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టప్రకారం స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఈస్ట్ బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఈ క్రమంలో పిల్లల పేరెంట్స్‌ను హెచ్చరించింది. ఈ స్కూల్‌లో మీ పిల్లలను చేర్పించవద్దని సూచించింది. ఇక, ఈ వీడియో చూసి పేరెంట్స్‌ షాక్‌ అవుతున్నారు. సదరు స్కూల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement