దీపిక ఇంట.. పెళ్లి సంబరాలు షురూ! | Deepika Padukone And Ranveer Singhs Pre Wedding Celebrations In Bangalore | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 7:06 PM | Last Updated on Fri, Nov 2 2018 7:54 PM

Deepika Padukone And Ranveer Singhs Pre Wedding Celebrations In Bangalore - Sakshi

బెంగళూరు: బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపిక పదుకొనె-ర‌ణ్‌వీర్ సింగ్‌ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. వారిద్దరి వివాహ వేడుక నవంబర్ 14,15 తేదీల్లో ఇట‌లీలో జరగనుండడం తెలిసిందే. పెళ్లికి పది రోజుల ముందే బెంగుళూరులోని దీపిక ప‌దుకొనె ఇంట ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. దీపిక ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో తమ కుటుంబీకులతో దీపిక ఎంజాయ్ చేస్తోంది.

శుక్రవారం దీపిక ఇంట్లో సాంప్రదాయకంగా పూజను నిర్వహించారు. దీనితో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని దీపిక సన్నిహితులు పేర్కొన్నారు. ఇటలీలో జరిగే దీపిక వివాహ వేడుకకు 200 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, డిసెంబర్ 11న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.


 




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement