
పెనుగొండ: అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు ఎస్.శ్రీరామమూర్తి(87) మంగళవారం బెంగళూరులో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. రూ.666తో చిన్న వయసు లోనే ఫ్లైవుడ్ వ్యాపారం ప్రారంభించిన శ్రీరామమూర్తి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఏర్పాటు చేసిన ‘మూర్తి గ్లాస్ అండ్ ఫ్లైవుడ్’ సంస్థ దేశంలోనే ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. పలు ఆలయ నిర్మాణాలకు సహకారం అందించిన శ్రీరామమూర్తి.. ఆ తర్వాత సుబ్రం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి జన్మస్థలమైన పెనుగొండను ప్రముఖ క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాసవీ థాంలో అన్నదాన భవనం, అష్టభుజి పుష్కరిణి, వాసవీ మందిర్, సువర్ణ అద్దాల మండపం నిర్మించారు. పేద విద్యార్థులకు సాయం చేయడమే కాక.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించారు.