Sriramamurthy
-
‘టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా..’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందిస్తున్న తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీరానీయడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి(టీడీపీ రెబల్)గా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, ఆర్టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలో అయ్యన్నపాత్రుడు అడ్డుతగిలాడని చెప్పారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు. చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని, అప్పుడు కూడా తాను బాధపడలేదని, కానీ తాజాగా ఆమెను కూడా తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదనకు గురై.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని శ్రీరామమూర్తి వివరించారు. -
బతుకు పాఠాలు చదివిన రచయిత
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సినీ, నాటక రంగాలపై చెరగని ముద్ర వేసిన పినిశెట్టి శ్రీరామమూర్తి 1985 ఏప్రిల్ 15న కన్నుమూశారు. సినీ నాటక రంగాలు ఉన్నంత వరకు ఆయన చిరస్మరణీయుడు. బతుకు పాఠాలు చదివిన రచయిత.. డిసెంబర్ 30 పినిశెట్టి శ్రీరామమూర్తి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సహజ ప్రతిభావంతుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. నాటకం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియలను తన రచనలతో సుసంపన్నం చేసిన రచయిత ఆయన. ఆనాటి ప్రతిష్ఠాత్మకమైన సాహితీ పత్రిక ‘భారతి’లో 1940 ప్రాంతాల్లో ఆయన రచనలు ప్రచురితమై, పండితుల దృష్టిని ఆకర్షించాయి. ‘భారతి’లో ప్రచురితమైన కథలను ఏరి కూర్చి, 1946లో ‘సవతితల్లి’ కథాసంపుటిని ప్రచురించారు. గ్రామీణ నేపథ్యంలో ఆయన రాసిన నాటకాలు ప్రజామోదం పొందాయి. ఆయన నాటకాలకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆంధ్ర నాటక పరిషత్’ పురస్కారాలు లభించాయి. నాటకరంగం మీదుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన వారిలో పినిశెట్టి శ్రీరామమూర్తి కూడా ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ప్రేక్షకుల మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి ఆయన. పినిశెట్టి శ్రీరామమూర్తి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1920 డిసెంబర్ 30న జన్మించారు. ఆయన తల్లి అమ్మణ్ణమ్మ గృహిణి, తండ్రి వెంకటరత్నం కోర్టు అమీను. బాల్యంలోనే రెండేళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ప్రాథమిక పాఠశాలలో చదుకుంటుండగా, పినిశెట్టి తెలివితేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్ చేశారు. తండ్రి ఉద్యోగ విరమణతో ఆయన చదువు ప్రాథమిక పాఠశాలతోనే ఆగిపోయింది. పెదతల్లి సలహాతో వ్యవసాయం, టైలరింగ్ నేర్చుకున్నా సంతృప్తి కలగలేదు. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవాడు. ఆయన ఉన్నత పాఠశాలలో చదవకున్నా, జీవిత పాఠశాలలో కష్టాలూ కన్నీళ్లూ బాధలూ వేదనలూ సహాధ్యాయులుగా, సహనం, సంయమనం, తాత్త్వికతలు గురువులుగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. పినిశెట్టి గురించి, ‘పాఠ్యపుస్తకాలు చదవని రచయిత. బతుకు పాఠాలు చదివిన నాటక సినీ రచయిత జీవన కథనం స్ఫూర్తిదాయకం’ అని ప్రముఖ విమర్శకుడు కిరణ్‌ప్రభ ప్రశంసించారు. ఆధునిక తెలుగు నాటక రచనలో పినిశెట్టి ముద్ర ప్రత్యేకం. గ్రామీణ జీవన నేపథ్యంలో సాగేవి ఆయన నాటకాలు. 1944లో ‘ఆదర్శజ్యోతి’ నాటకాన్ని రాసి, ‘ఆదర్శ నాట్యమండలి’ ద్వారా ప్రదర్శించి, నటించి ప్రశంసలు పొందారు. ఆయన 1949లో ‘పల్లెపడుచు’ నాటకం రాశారు. ఆ నాటకాన్ని ‘ఆంధ్ర కళాపరిషత్’ ఆధ్వర్యాన 1950లో కాకినాడలో ప్రదర్శించగా, ఉత్తమ నాటక బహుమతి పొందింది. ఆ నాటకంలో ఆదర్శ రైతు సూరయ్య పాత్ర ధరించిన రచయిత, ఉత్తమ నటుడిగా కూడా బహుమతి పొందారు. ఆనాటి కార్యక్రమానికి ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్యఅతిథిగా హాజరై, బహుమతి ప్రదానం చేశారు. అద్భుతమైన సంభాషణలతో కూడిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించని పల్లెటూరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదని రంగస్థల ప్రముఖుడు డాక్టర్ చాట్ల శ్రీరాములు ఒక సందర్భంలో చెప్పారు. ఆ నాటకం అప్పట్లోనే ఏడు ముద్రణలు పొందిందంటే, ఎంతగా ఆనాటి పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పినిశెట్టికి పేరు తెచ్చిపెట్టిన నాటకాల్లో ‘అన్నాచెల్లెలు (1952), స్త్రీ పాత్ర లేని ‘ఆడది’ (1952), ‘కన్నకొడుకు’ (1956) వంటివి ముఖ్యమైనవి. పినిశెట్టి 1954లో సినీరంగంలోకి అడుగు పెట్టారు. సినిమారంగంలో ప్రవేశించిన సంవత్సరంలోనే ఆయన రాసిన రెండు నాటకాలు సినిమాలుగా రూపొందాయి. వాటికి ఆయనే సంభాషణలు రాశారు. సినీరంగంలో కొనసాగుతూనే, నాటక ప్రేక్షకుల కోరిక మేరకు 1963లో ‘పంజరంలో పక్షులు’ నాటకం రాశారు. ఈ నాటకాన్ని 1968లో పుస్తకరూపంలో ముద్రించి, ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావుకు అంకితం చేశారు. పినిశెట్టి సినీ ప్రస్థానం బీఏ సుబ్బారావు దర్శకత్వంలోని ‘రాజు–పేద’ (1954) సినిమాతో మొదలైంది. ఆ సినిమాకు ఆయన సంభాషణలు రాశారు. అదే ఏడాది ఆయన నాటకం ‘పల్లెపడుచు’ను బోళ్ల సుబ్బారావు సినిమాగా నిర్మించారు. ఆయన రాసిన ‘అన్నాచెల్లెలు’ నాటకం తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పరివర్తన’గా అదే ఏడాది వెండితెరపై విడుదలైంది. ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి ఆనాటి అగ్ర నటీనటులు నటించారు. పినిశెట్టి ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. తోట కృష్ణమూర్తి నిర్మించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘సంతానం’, ‘ఇలవేల్పు’, ‘రామాలయం’, ‘బంగారు గాజులు’ వంటి దాదాపు అరవై సినిమాలకు సంభాషణలు రాశారు. ‘చిలకా గోరింక’, ‘గృహలక్ష్మి’ వంటి సినిమాల్లో హాస్యపాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా పత్రికలు ఆయనను ‘స్వతంత్ర చిత్రరచనా చక్రవర్తి’గా అభివర్ణించాయి. పినిశెట్టి శ్రీరామమూర్తి పెద్దకొడుకు రవిరాజా పినిశెట్టి ప్రముఖ దర్శకుడు. రవిరాజా 1980లో దర్శకత్వం వహించిన ‘వీరభద్రుడు’ సినిమాకు కూడా పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు రాశారు. ఆయన మనవడు ఆది పినిశెట్టి హీరోగా సినీరంగంలో కొనసాగుతున్నారు. - డాక్టర్ పీవీ సుబ్బారావు -
‘వైశ్య రత్న’ రామమూర్తి కన్నుమూత
పెనుగొండ: అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు ఎస్.శ్రీరామమూర్తి(87) మంగళవారం బెంగళూరులో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. రూ.666తో చిన్న వయసు లోనే ఫ్లైవుడ్ వ్యాపారం ప్రారంభించిన శ్రీరామమూర్తి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఏర్పాటు చేసిన ‘మూర్తి గ్లాస్ అండ్ ఫ్లైవుడ్’ సంస్థ దేశంలోనే ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. పలు ఆలయ నిర్మాణాలకు సహకారం అందించిన శ్రీరామమూర్తి.. ఆ తర్వాత సుబ్రం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి జన్మస్థలమైన పెనుగొండను ప్రముఖ క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాసవీ థాంలో అన్నదాన భవనం, అష్టభుజి పుష్కరిణి, వాసవీ మందిర్, సువర్ణ అద్దాల మండపం నిర్మించారు. పేద విద్యార్థులకు సాయం చేయడమే కాక.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించారు. -
మిశ్రమ వ్యవసాయంతో లాభాలు
కళ్యాణదుర్గంరూరల్: రైతులు మిశ్రమ వ్యవసాయంతో అనేక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ జేడీ టీవీ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. మండలంలోని భట్టువానిపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి జేడీఏ, కేవీకే సమన్వకర్త డాక్టర్ జాన్ సుధీర్, మహానంది అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, కేవీకే డాక్టర్ ప్రసాద్‌బాబు, ఆదినారాయణ, రేజష్, తిమ్మప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో రావీప్ విద్యార్థినులు పాల్గొన్నారు. అమడగూరు: పంటలకు రసాయనాల వాడకం ద్వారా తక్కువ ఖర్చులు వస్తాయని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. గుండువారిపల్లి గ్రామంలో నాలుగు నెలల నుంచి వ్యవసాయ కళాశాలకు చెందిన 18 మంది రావె విద్యార్థులు చేపట్టిన శిక్షణలో భాగంగా సోమవారం గ్రామ సచివాలయంలో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా హాజరైన సంపత్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, రసాయనాలను వినియోగించడం ద్వారా పంటలో కలుపు రాకుండా, రోగాలు సోకకుండా నివారించవచ్చన్నారు. అలాగే వేరుశనగలో వస్తున్న కొత్త వంగడాలైన కే–9, కే–6 ను సాగు చేయడం ద్వారా ఏకంగా 45 రోజుల పాటు నీటి సరఫరా లేకున్నా పంట తట్టుకుంటుందన్నారు.ఈసందర్భంగా ఆర్గానిక్ క్లస్టర్ సీఏ, సీఆర్పీలు కొన్ని రకాల కషాయాలను తయారు చేసి చూపించారు. అనంతరం సచివాలయంలో రావె విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను, పోస్టర్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కవితారాణి, సర్పంచ్ శశికళ, కదిరి ఏడీఏ లక్ష్మినారాయణ, ఓడీచెరువు ఏఓ సత్యనారాయణ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
రాయితీతో పైపులు
అనంతపురం అగ్రికల్చర్: జాతీయ నూనెగింజల పథకం కింద రాయితీతో అందించనున్న నీటి సరఫరా పైపులు (వాటర్ క్యారియింగ్ పైప్స్) అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాకు 445 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. రెండు, రెండున్నర, మూడు, నాలుగు ఇంచుల పీవీసీ పైపులు ఇస్తామన్నారు. ఐదు ఎకరాల్లోపున్న రైతులకు ఒక్కో యూనిట్ కింద రెండు, రెండున్నర ఇంచుల పైపులు 43, మూడు ఇంచులవి 35, నాలుగు ఇంచులవి 25 పైపులు ఇస్తామన్నారు. అలాగే ఐదు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రెండు, రెండున్నర ఇంచులవి 66, మూడు, నాలుగు ఇంచులవి 50 పైపులు ఇస్తామన్నారు. రెండు ఇంచుల పైపులకు సంబంధించి పూర్తి ధరపై రూ.155, ఆపైన ఉన్న పైపులపై రూ.210 ప్రకారం రాయితీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అవసరమైన వేరుశనగ రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కంది పంట కాపాడేందుకు రక్షకతడి
కణేకల్లు : కంది పంటను కాపాడుకునేందుకు రక్షకతడులు అందిస్తున్నామని జేడీఏ శ్రీరామూర్తి పేర్కొన్నారు. మండలంలోని పులచెర్ల, పుల్లంపల్లి గ్రామాల్లో సాగులో ఉన్న కంది పంటను రాయదుర్గం ఏడీఏ మద్డిలేటి, ఏఓ శ్రీనివాసులతో కలిసి గురువారం పరిశీలించారు. జేడీఏ మాట్లాడుతూ రక్షకతడి కోసం ఒక ట్యాంకుకు రూ.430 ఖర్చు అవుతోందని, ఇందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 20 శాతం రైతులు భరించాలన్నారు. అనంతరం ఆయన మండలంలోని బ్రహ్మసముద్రం, బెణికల్లు గ్రామాల్లో హెచ్చెల్సీ ఆయకట్టులో నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. బాధిత రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. -
అంతా వినోదం
విజయ్ భరత్, అశ్విని, కాంచన హీరో హీరోయిన్లుగా శ్రీరామమూర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వినోదం 100%’. పొట్నూరు చక్రధరుడు సమర్పణలో పొట్నూరు శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సంపూర్ణేశ్‌బాబు, పృథ్వి ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతగా మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రంలో వంద శాతం వినోదం ఉంటుంది. సంపూర్ణేశ్, పృథ్వి పాత్రలు చాలా బాగుంటాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాశ్ ఆనంద్, కథ: జయకుమార్.