కణేకల్లు : కంది పంటను కాపాడుకునేందుకు రక్షకతడులు అందిస్తున్నామని జేడీఏ శ్రీరామూర్తి పేర్కొన్నారు. మండలంలోని పులచెర్ల, పుల్లంపల్లి గ్రామాల్లో సాగులో ఉన్న కంది పంటను రాయదుర్గం ఏడీఏ మద్డిలేటి, ఏఓ శ్రీనివాసులతో కలిసి గురువారం పరిశీలించారు. జేడీఏ మాట్లాడుతూ రక్షకతడి కోసం ఒక ట్యాంకుకు రూ.430 ఖర్చు అవుతోందని, ఇందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 20 శాతం రైతులు భరించాలన్నారు.
అనంతరం ఆయన మండలంలోని బ్రహ్మసముద్రం, బెణికల్లు గ్రామాల్లో హెచ్చెల్సీ ఆయకట్టులో నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. బాధిత రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
కంది పంట కాపాడేందుకు రక్షకతడి
Published Thu, Oct 27 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
Advertisement
Advertisement