చెనక్కాయకు రక్షకతడి కష్టం | rakshaka thadi tough to groundnut | Sakshi
Sakshi News home page

చెనక్కాయకు రక్షకతడి కష్టం

Published Tue, Aug 1 2017 10:01 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

rakshaka thadi tough to groundnut

అనంతపురం అగ్రికల్చర్‌: కన్నీరు కార్చడానికి కూడా నీళ్లు కరువైన అనంతపురం జిల్లాలో... లక్షలాది ఎకరాల వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చి కాపాడటం ఎవరి వల్ల కాదని శింగనమలకు చెందిన రైతు విజభాస్కర్‌ చెప్పారు. మంగళవారం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంశంపై ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో పలువురు రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ కె.రాజారెడ్డి, రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌వీ నాయుడు, క్రీడా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కేవీ రావు తదితరుల సమక్షంలో రైతులు మాట్లాడారు.

వేరుశనగకు రక్షకతడి అసాధ్యం
లక్షల ఎకరాల వేరుశనగకు రక్షకతడి ఇవ్వడం ఎవరి వల్లా కాదు. నీటి వనరులు అందుబాటులో లేవు. బోరుబావులు నీళ్లు రాక ఎండిపోతున్నాయి. ఉన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 10 నుంచి 20 మిల్లీమీటర్లు (మి.మీ) మేర రెండు మూడు తడులు ఇస్తే గానీ వేరుశనగ పండదు. దానికి బదులు కంది పంటకు రక్షక తడి ఇస్తే ప్రయోజనం ఉంటుంది. తక్కువ కాలవ్యవధి కలిగిన కంది రకాలు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయడం కూడా కష్టమే. చాలా మంది రైతులు ఆగస్టు నెలలో కూడా వేరుశనగ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్వింటా రూ.11 వేలకు కొంటే... ఇపుడు అమ్మాలంటే రూ.7 వేలు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసమైనా వేరుశనగ వేసే పరిస్థితి ఉంది.
- విజయభాస్కర్, శింగనమల

నవధాన్యాలను ప్రోత్సహించాలి
వేరుశనగను తగ్గించి నవధాన్యపు పంటలను ప్రోత్సహించాలి. పావు కిలో, అర కిలో అంటూ కిట్లు రూపంలో అరకొరగా ఇస్తే ప్రయోజనం ఉండదు. ముందస్తు ప్రణాళికతో చిరుధాన్యాలు, నవధాన్యపు పంటలపై అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే పంటల విస్తీర్ణం పెరుగుతుంది.
- భాస్కర్, చెన్నేకొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement