
అంతా వినోదం
విజయ్ భరత్, అశ్విని, కాంచన హీరో హీరోయిన్లుగా శ్రీరామమూర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వినోదం 100%’. పొట్నూరు చక్రధరుడు సమర్పణలో పొట్నూరు శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సంపూర్ణేశ్‌బాబు, పృథ్వి ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతగా మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రంలో వంద శాతం వినోదం ఉంటుంది. సంపూర్ణేశ్, పృథ్వి పాత్రలు చాలా బాగుంటాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాశ్ ఆనంద్, కథ: జయకుమార్.