మిశ్రమ వ్యవసాయంతో లాభాలు | Mixed farming profits | Sakshi
Sakshi News home page

మిశ్రమ వ్యవసాయంతో లాభాలు

Published Tue, Nov 22 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

Mixed farming profits

కళ్యాణదుర్గంరూరల్‌: రైతులు మిశ్రమ వ్యవసాయంతో అనేక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ జేడీ  టీవీ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. మండలంలోని భట్టువానిపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి జేడీఏ, కేవీకే సమన్వకర్త డాక్టర్‌ జాన్ సుధీర్, మహానంది అగ్రికల్చర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, కేవీకే డాక్టర్‌ ప్రసాద్‌బాబు, ఆదినారాయణ, రేజష్, తిమ్మప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో రావీప్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

అమడగూరు: పంటలకు రసాయనాల వాడకం ద్వారా తక్కువ ఖర్చులు వస్తాయని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. గుండువారిపల్లి గ్రామంలో నాలుగు నెలల నుంచి వ్యవసాయ కళాశాలకు చెందిన 18 మంది రావె విద్యార్థులు చేపట్టిన శిక్షణలో భాగంగా సోమవారం గ్రామ సచివాలయంలో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా హాజరైన సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, రసాయనాలను వినియోగించడం ద్వారా పంటలో కలుపు రాకుండా, రోగాలు సోకకుండా నివారించవచ్చన్నారు. అలాగే వేరుశనగలో వస్తున్న కొత్త వంగడాలైన కే–9, కే–6 ను సాగు చేయడం ద్వారా ఏకంగా 45 రోజుల పాటు నీటి సరఫరా లేకున్నా పంట తట్టుకుంటుందన్నారు.ఈసందర్భంగా ఆర్గానిక్‌ క్లస్టర్‌ సీఏ, సీఆర్పీలు కొన్ని రకాల కషాయాలను తయారు చేసి చూపించారు. అనంతరం సచివాలయంలో రావె విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను, పోస్టర్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కవితారాణి, సర్పంచ్‌ శశికళ, కదిరి ఏడీఏ లక్ష్మినారాయణ, ఓడీచెరువు ఏఓ సత్యనారాయణ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement