హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది హైదరాబాద్‌లో 34వ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి18 వరకు హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఇక్కడి సిద్దిఅంబర్‌బజార్‌లోని బెహతీభవన్‌లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
తొలుత దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో, కేథార్‌నాథ్, ఉత్తరాఖండ్ వరదల్లో, పాక్ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయినవారికి, గతేడాది చనిపోయిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు వీహెచ్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌సింఘాల్, యూపీకి చెందిన చిన్మయానంద స్వామిజీతోపాటు రాష్ట్రంలోని ప్రధాన సాధు సంతులు హాజరవుతారన్నా రు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు మాట్లాడుతూ.. నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, హిందూ ఉత్సవాలపై పనిగట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కల గకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, ఆలె జితేందర్, టీడీపీ నేత జి.ఎస్.బుగ్గారావు, బీజేపీ నేత వై.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు సర్కారే చేపట్టాలి
Published Sat, Aug 10 2013 1:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement