భారత సైన్యానికి నివాళిగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన ఓ పాటను విడుదల చేస్తున్నానని తెలంగాణ బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్టర్ సాక్షిగా శుక్రవారం నాడు గొప్పగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేశారు. అయితే ఆశించినట్లుగా ప్రశంసల జల్లు కురవకుండా, ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శల జడివానా మొదలయింది. ఆ తిట్ల పరంపర ఒక్క భారతీయుల నుంచే కాకుండా సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్ ప్రజల నుంచి కూడా హోరెత్తుతోంది.