నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమని పాకిస్తాన్ పేర్కొంది. అది పరస్పర కాల్పుల ఘటన మాత్రమేనని.. దానిని భారత్ సర్జికల్ దాడులుగా చెప్పుకొంటూ మీడియా హైప్‌ను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ మేరకు గురువారం పాక్ సైన్యం, వాయుసేన ప్రకటనలు చేశాయి. ‘నియంత్రణ రేఖ దాటి భారత్ సర్జికల్ దాడులేమీ చేయలేదు. ఎప్పట్లాగే భారత్ కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. దీంతో సహజంగానే పాక్ సైన్యం దీటుగా బదులిచ్చింది.