
భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం
ఇస్లామాబాద్: తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ టీనేజీ బాలుడిని పాక్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. కాశ్మీర్లోని ఝానగర్కు చెందిన మంజర్ హుస్సేన్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అతడు నవంబర్ 14వ తేదీన అనుకోకుండా భారత్, పాక్ సరిహద్దుల్లోని అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పొరుగు దేశ భూభాగంలోకి ప్రవేశించాడు.
దాంతో హుస్సేన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు. దాంతో హుస్సేన్ను ఉన్నతాధికారులు విచారించి ... మంగళవారం చకొటి -యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్ను అప్పగించినట్లు పాక్ సైన్యం తెలిపింది.