పాకిస్తాన్ సైన్యంపై ఆ దేశానికి రాజకీయ మహిళా నేత కుమార్తె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సైన్యం వ్యవహారశైలిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్‌లో పెద్ద దుమారమే రేపింది. నాటకీయ పరిణామాల తర్వాత ఆమె ట్విటర్ ఖాతా మాయమయిందని పాక్ మీడియా వెల్లడించింది. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ ఈ వీడియో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఫైజాబాద్‌లో సైన్యం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్మీ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని దుయ్యబట్టారని పాకిస్తాన్ టుడే పత్రిక తెలిపింది. ఈ వీడియోను ట్విటర్ నుంచి తొలగించడానికంటే ముందు పాకిస్తాన్‌లో చాలా మంది వీక్షించారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఆమె ట్విటర్ ఖాతా మాయం
Published Fri, Dec 1 2017 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement