ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నిగార్ జోహర్ అరుదైన ఘనత సాధించారు. పాక్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదా దక్కించుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కారు. అదే విధంగా ఆర్మీ సర్జన్ జనరల్‌గా విధులు నిర్వర్తించనున్న మొదటి మహిళగా నిలిచారు. ఈ విషయాన్ని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ మాజ్ జెన్ బాబర్ ఇఫ్తిఖర్ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి పొందిన తొలి మహిళ ఈమె. పాక్ ఆర్మీ తొలి మహిళా సర్జన్‌గా నియమితులయ్యారు’’ అని పేర్కొన్నారు.(మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం?)
కాగా రావల్సిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జోహర్.. 1985లో పాక్ ఆర్మీ మెడికల్ కార్స్ప్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో మేజర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ఆమె కంటే ముందు షహీదా బాద్‌షా, షహీదా మాలిక్ అనే ఇద్దరు మహిళలు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. ఇక జోహర్ తండ్రి, భర్త కూడా పాక్ ఆర్మీలో సేవలు అందించిన వారే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment