violates ceasefire
-
బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది. చైనాతో 9వ విడత చర్చలు భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. -
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద పాక్స్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులోని ఎల్ఓసి వద్ద బీఎస్ఎఫ్ స్థావరాలపై పాక్ సోమవారం కాల్పులకు దిగింది. కాల్పుల ప్రభావం సరిహద్దులోని రెండు గ్రామాలపై ఉంటుందని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నందున కశ్మీర్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాక్ సరిహద్దులోని ఆర్నియా, ఆర్ఎస్ పుర, రాంగఢ్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టారని, పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఎల్ఓసీ సరిహద్దులోని ఆఖ్కూనూర్లో ఎనిమిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోగా, ఆర్నియా సెక్టార్లో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం పాక్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వేగంగా స్పందించిన భద్రత దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టన విషయం తెలిసిందే. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నట్లు వెన్నకి తగ్గిన పాక్, సోమవారం మరోసారి రెచ్చిపోయి దాడులకు పాల్పడింది. పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏవిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందో 19 సెకన్ల థర్మల్ ఇమేజరీ ఫుటేజ్‌ను బీఎస్ఎఫ్ అధికారులు విడుదల చేశారు. కాగా ఏడాది సమయంలో పాక్ ఎల్ఓసి వద్ద 700 సార్లు దాడులకు పాల్పడిందని, 38 పౌరులు, 18 మంది భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారని ఆర్మీ ఈ అధికారులు తెలిపారు. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్ : పాకిస్థాన్ ఆర్మీ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. తాజాగా గురువారం ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్పైకి కాల్పులు జరిపాయి. సెక్టర్లోని దనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. అయితే వెంటనే స్పందించిన... భారత ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది. ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. -
మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ : పాకిస్థాన్ తరచు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. జమ్మూ ప్రాంతం సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పూంచ్, రాజౌరీ జిల్లాలోని సైనికులే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం రాత్రి కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి మనీష్ మెహతా వెల్లడించారు. ఈ కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయని ఆయన తెలిపారు. అయితే పాక్ సైనికులు దాడిని భారత సైన్యం తిప్పికొట్టిందన్నారు. పాక్ కాల్పుల్లో భారత్ సైన్యంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకొట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దాదాపు గంటపైగా ఇరువైపులా కాల్పులు జరిపుకున్నాయని మెహతా వివరించారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. -
హమీర్పూర్ వద్ద పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్ సమీపంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. గత మూడు రోజులుగా హమీర్పూర్ ప్రాంతంలో వరుసగా కాల్పులకు పాక్ సైన్యం తెగబడుతుందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీన భారత్ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, 62 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
48 గంటల్లో పాక్ ఆరోసారి కాల్పుల ఉల్లంఘన
జమ్మూకాశ్మీర్(పిటిఐ): పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద గడచిన 48 గంటలలో ఆరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని ఖార్కోలా సరిహద్దులలో పాక్ మళ్లీ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. జమ్మూ ప్రాంతంలోని సాంబ జిల్లాలోని బీఎస్ఎఫ్ దళాలకు చెందిన మంగు చాక్, కాద్వా చెక్ పోస్ట్‌లపై నిన్నఉదయం నుంచి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే భారత్ సైన్యం వెంటనే స్పందించిందన్నారు. కాగా ఇరువైపులా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పాక్ సైన్యం మంగళవారం ఒక్క రోజే హమీర్పూర్ ప్రాంతంలో మూడు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన సంగతిని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మరణించిన సంగతి విదితమే. మెంధార్‌లోని హమీర్పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్‌ఖాన్ మరణించినట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నాలుగు రోజుల కాలవ్యవధిలో పాక్ సైన్యం 8 సార్లు భారత్ సరిహద్దుపై కాల్పులకు తెగబడిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.