భారత్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఆర్. కే. పాల్టా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిన్న సాయంత్రం బాగా పొద్దుపోయిన తరువాత ఎల్ఓసీ సమీపంలోని పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టర్పై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి.
దాంతో భారత దళాలు అప్రమత్తమైనాయి. ఎదురు దాడికి దిగాయా. దాంతో ఇరువైపులా 10 నిముషాల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ భద్రత దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. 2003లో భారత్, పాక్ దేశాలు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇటీవల కాలంలో తరుచుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.