పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని నాలుగు బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ బలగాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయి. పాక్ బలగాల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
ఆదివారం ఒక్కరోజే రెండుసార్లు కాల్పుల విరమణ ఒడంబడికను పాకిస్థాన్ అతిక్రమించింది. పూంచ్ జిల్లాలోని మంధర్ ప్రాంతంలో ఉదయం 11.30లో ఒకసారి, సాయంత్రం 4.05 గంటల ప్రాంతంలో మరోసారి కాల్పులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ కవ్వింపు కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయని పేర్కొన్నారు.