
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా సరిహద్దులో పాక్ బలగాలు శనివారం కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాలు మూడుసార్లు కాల్పులకు దిగాయని వెల్లడించింది.
ఈ కాల్పుల్లో నలుగురు సామాన్యులు గాయపడినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.