
ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు బుధవారం ప్రయత్నించారు. ఆ విషయాన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.